ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

కొత్త పన్ను విధానం ఆదాయపన్ను 2020-21

పాత ఇన్కమ్ టాక్స్ కి మరియు కొత్త ఇన్కమ్ టాక్స్ కి రాబోయే సంవత్సరంలో తేడా తెలుసుకోవాలనుకుంటున్నారా...
రూ. 2.5 లక్షలలోపు ఆదాయమున్న వారికి పన్ను నుంచి మినహాయింపు 1) రూ. 2.5 లక్షల1నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయమున్న వారికి 5 శాతం పన్ను 2) రూ. 5 నుంచి 7.5 లక్షల ఆదాయమున్నవారికి 10శాతం పన్ను 3) రూ. 7.5 నుంచి 10 లక్షల ఆదాయమున్న వారికి 15శాతం, 4) రూ. 10 నుంచి 12 లక్షల ఆదాయమున్న వారికి 20 శాతం, 5) రూ. 12.5 నుంచి రూ. 15 లక్షల ఆదాయమున్న వారికి 25 శాతం, 6) రూ. 15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయమున్నవారికి 30 శాతం
Tax analysis Old Vs New Slabs
ఆదాయపు పన్ను స్లాబుల లో ఉన్న మెలిక 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావు కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాత విధానంతో పాటు కొత్త విధానమూ అమల్లో ఉంటుంది. కొత్త ట్యాక్స్‌ విధానం ఎంచుకుంటే.... ఈ మినహాయింపులు ఉండవ్‌ *ఇంటి అద్దె, గృహ రుణ వడ్డీ, ఆరోగ్య బీమా *జీవిత బీమా, ఎల్టీసీ, పీఎఫ్‌.. తగ్గింపులు *80సీ, 80సీసీసీ, 80సీసీడీ సెక్షన్ల కింద గరిష్ఠంగా లభించే రూ.1.5 లక్షల మినహాయింపు పోతుంది. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌), బ్యాంకులో వేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఆరోగ్య బీమా, ఎల్‌ఐసీ ప్రీమియమ్‌లు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు వంటివి ఈ సెక్షన్ల కిందికి వస్తాయి. *80 డి కింద ఆరోగ్య బీమా (మామూలు వ్యక్తులకు రూ.25 వేలు, వృద్ధులకైతే రూ.30 వేలు) పై మినహాయింపు పోతుంది. *సెక్షన్‌ 80టీటీఏ కింద.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ (రూ.10 వేల లోపు) మినహాయింపు పోతుంది. *ఈక్విటీ సేవింగ్‌ పథకాల్లో పెట్టే సొమ్ములో 50 శాతం (గరిష్ఠంగా రూ.25 వేలు)పై 80 సీసీజీ కింద వర్తించే పన్ను మినహాయింపు లభించదు. *ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై సెక్షన్‌ 80ఈఈబీ కింద.. ఉన్నత విద్యకు తీసుకునే రుణాలపై వడ్డీకి సంబంధించి సెక్షన్‌ 80ఈ కింద (దీనికైతే పరిమితి లేదు).. దాతృత్వ సంస్థలకు ఇచ్చే విరాళాలపై 80జీ కింద.. వైద్య ఖర్చులపై సెక్షన్‌ 80 డీడీబీ కింద.. ఉద్యోగులకు ఎల్టీసీ, హౌస్‌ రెంటు అలవెన్స్‌ (అద్దె భత్యం)కింద ఇస్తున్న చాలా మినహాయింపులు పోతాయి. పాత విధానం స్లాబులు Taxble Income రు 5 లక్ష లు మించని వారికి మనము pay చేయవలసిన టాక్స్ నుండి రు 12,500/- మినహాయింపు లభిస్తుంది. 1.రు. 2,50,000/- వరకు పన్ను లేదు 2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు 5 శాతం 3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు రు 2,500+5 శాతం 4.రు 5,00,000/- నుండి రు 10,00,000/- వరకు రు 12,500 +20 శాతం 5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం                01-02.2020 రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం. 1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5లక్షలు పాత విధానం లో 6,50,000-1,50,000 =5,00,000 2.5లక్షల వరకు టాక్స్ 0 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0 కొత్త విధానం లో 2.5లక్షల వరకు టాక్స్ 0 2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 6.5లక్షల వరకు టాక్స్ 1,50,000 X10% = 15,000 చెల్లించాల్సిన టాక్స్ 27,500 2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5లక్షలు పాత విధానం లో 7,00,000-1,50,000 =5,50,000 2.5లక్షల వరకు టాక్స్ 0 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 5.5లక్షల వరకు టాక్స్ 50,000 X20% = 10,000 చెల్లించాల్సిన టాక్స్ 22,500 కొత్త విధానం లో 2.5లక్షల వరకు టాక్స్ 0 2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 7.0లక్షల వరకు టాక్స్ 2,00,000 X10% = 20,000 చెల్లించాల్సిన టాక్స్ 32,500 3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5లక్షలు పాత విధానం లో 8,50,000-1,50,000 =7,00,000 2.5లక్షల వరకు టాక్స్ 0 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 7.0లక్షల వరకు టాక్స్ 2,00,000 X20% = 40,000 చెల్లించాల్సిన టాక్స్ 52,500 కొత్త విధానం లో 2.5లక్షల వరకు టాక్స్ 0 2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 7.5లక్షల వరకు టాక్స్ 2,50,000 X10% = 25,000 7.5-8.5లక్షల వరకు టాక్స్ 1,00,000 X15% = 15,000 చెల్లించాల్సిన టాక్స్ 52,500 *పాత కొత్త టాక్స్ లో తేడా లేదు* 4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5లక్షలు పాత విధానం లో 9,00,000-1,50,000 =7,50,000 2.5లక్షల వరకు టాక్స్ 0 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 7.5లక్షల వరకు టాక్స్ 2,50,000 X20% = 50,000 చెల్లించాల్సిన టాక్స్ 62,500 కొత్త విధానం లో 2.5లక్షల వరకు టాక్స్ 0 2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 7.5లక్షల వరకు టాక్స్ 2,50,000 X10% = 25,000 7.5-9.0లక్షల వరకు టాక్స్ 1,50,000 X15% = 22,500 చెల్లించాల్సిన టాక్స్ 60,000 5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5లక్షలు పాత విధానం లో 12,50,000-1,50,000 =11,00,000 2.5లక్షల వరకు టాక్స్ 0 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 10లక్షల వరకు టాక్స్ 5,00,00 X20% = 1,00,000 10.0 - 11లక్షల వరకు టాక్స్ 1,00,000 X30% = 30,000 చెల్లించాల్సిన టాక్స్ 1,42,500 కొత్త విధానం లో 2.5లక్షల వరకు టాక్స్ 0 2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 7.5లక్షల వరకు టాక్స్ 2,50,000 X10% = 25,000 7.5-10.0లక్షల వరకు టాక్స్ 2,50,000 X15% = 37,500 10.0 - 12.5లక్షల వరకు టాక్స్ 2,50,000 X20% = 50,000 చెల్లించాల్సిన టాక్స్ 1,25,000 6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5లక్షలు పాత విధానం లో 16,00,000-1,50,000 =14,50,000 2.5లక్షల వరకు టాక్స్ 0 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 10లక్షల వరకు టాక్స్ 5,00,000 X20% = 1,00,000 10.0 - 14.5లక్షల వరకు టాక్స్ 4,50,000 X30% = 1,35,000 చెల్లించాల్సిన టాక్స్ 2,47,500 కొత్త విధానం లో 2.5లక్షల వరకు టాక్స్ 0 2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 5.0 - 7.5లక్షల వరకు టాక్స్ 2,50,000 X10% = 25,000 7.5-10.0లక్షల వరకు టాక్స్ 2,50,000 X15% = 37,500 10.0 - 12.5లక్షల వరకు టాక్స్ 2,50,000 X20% = 50,000 12.5 - 15లక్షల వరకు టాక్స్ 2,50,000 X25% = 62,500 15.0 - 16లక్షల వరకు టాక్స్ 1,00,000 X30% = 30,000 చెల్లించాల్సిన టాక్స్ 2,17,500 పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం. ఈరోజు ప్రకటించిన 6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.